Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తప్పించుకుని తిరుగుతున్న వనిత వైఖరిపై పోలీసుల సీరియస్!

  • ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • లొంగిపోకుండా సెల్ఫీ వీడియోల్లో కనిపిస్తున్న వనిత
  • అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామన్న పోలీసులు
విచారణకు రావాలని నోటీసులు పంపినప్పటికీ, బయటకు రాకుండా తప్పించుకు తిరుగుతూ, సెల్ఫీ వీడియోలు, ఫోటోలను మీడియాకు విడుదల చేస్తున్న వనిత (సినీ నటుడు విజయ్ భార్య) వైఖరిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. విజయ్ మరణించిన రోజున, ఉస్మానియా మార్చురీ వద్ద కనిపించిన వనిత, ఆపై రహస్య ప్రదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

భార్య, బిడ్డ లేకుండానే విజయ్ అంత్యక్రియలు జరిగిపోగా, ఆపై వనిత సెల్ఫీ వీడియోలను మీడియాకు విడుదల చేస్తూ, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది. విజయ్ తన ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, వనితపై కేసు పెట్టి, విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆమె మాత్రం వాటిని పట్టించుకోలేదు.

తాజాగా, మరో అమ్మాయితో విజయ్ సన్నిహితంగా ఉన్న చిత్రాలను విడుదల చేయడం, పోలీసుల ముందుకు రాలేకపోతున్నానని చెప్పడం కలకలం రేపగా, ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, నేడో రేపో, ఆమెను ట్రేస్ చేసి, అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Vanita
Vijay Sai
Police
Arrest
Sucide

More Telugu News